పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
finger millets,ఫింగర్ మిల్లెట్,రాగులు,చోళ్ళు
రుచిలో కాస్త తీపిదనం కలిగిన రాగుల్లో పోషక విలువలు అపారం. సులభంగా జీర్ణమయ్యే దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రాగులతో చేసిన ఆహారం రోజూ తీసుకోవడం వల్ల పెద్దపేగుకి తగిన నీటి నిల్వలు అందుతాయి. రాగుల్లో తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లూ, చక్కెర నిల్వలూ, ఎక్కువ మొత్తంలో పీచు ఉంటుంది. తరచూ రాగుల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణప్రకియ మెరుగుపడి, మలబద్ధకం సమస్య దూరమవుతుంది. మధుమేహంతో బాధపడే వారికి రాగులు మంచి ఆహారం.
రాగుల్లో తగిన మోతాదులో లభించే మెగ్నీషియం మైగ్రెయిన్ తలనొప్పీ, గుండె సంబంధిత వ్యాధులకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. విటమిన్ బీ3 శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. వీటిల్లో అధిక మోతాదులో లభించే యాంటీ ఆక్సిడెంట్లూ, క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికళ్లను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ట్రిప్టోఫాన్‌గా పిలిచే అమినో యాసిడ్ రాగిలో తగు మోతాదులో లభిస్తుంది. ఇది ఆకలిని తగ్గించి వూబకాయం రాకుండా కాపాడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని ఫైటో కెమికల్స్ జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి.
రాగుల్లో ఉండే క్యాల్షియం ఎముక బలాన్ని పెంచుతుంది. ఆస్టియో పోరోసిస్ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీనిలో సహజంగా లభించే ఇనుము రక్త హీనతను నివారిస్తుంది. రాగితో చేసిన పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల పోషకాహార లేమి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
రాగి (Finger Millet) (ఎల్యూసీన్ కొరకానా, అమ్హరిక్ లో తోకూసో) ని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని వ్యవహరిస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. దీనిని ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఆసియాలోని మెట్టప్రాంతాలలో పండిస్తారు. రాగి స్వస్థలము ఇథియోపియాలోని ఎత్తుప్రదేశాలు అయితే నాలుగువేల సంవత్సరాలకు పూర్వము భారతదేశములో ప్రవేశపెట్టబడినది. ఇది ఎత్తు ప్రాంతాల యొక్క వాతావరణానికి సులువుగా అలవడే పంట. హిమాలయాల పర్వతసానువుల్లో 2300 మీటర్ల ఎత్తువరకు రాగిని పండిస్తారు.
Nutritional value of Finger Miller per 100g
Protein 7.6g
Fat 1.5g
Carbohydrate 88g
Calcium 370mg
Vitamins - A: 0.48mg
Thiamine (B1): 0.33mg
Riboflavin (B2): 0.11mg
Niacin: (B3) 1.2mg
Fiber 3g
- చిట్టి రాగులు.. గట్టి లాభాలు
చూడటానికి సన్నగా కనిపిస్తాయి గానీ రాగుల్లో క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్, పీచుతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువే. పైగా కొవ్వు శాతం తక్కువ. మధుమేహులకు, వూబకాయులకైతే రాగులు వరదాయిని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటిల్లో మన శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్, వాలైన్, మెథియోనైన్, ఐసోల్యూసిన్, థ్రియోనైన్ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. వంద గ్రాముల రాగిపిండిని తింటే ఆ రోజుకి మనకు అవసరమైన 350 మి.గ్రా. క్యాల్షియం లభించినట్టే. అలాగే ఐరన్ 3.9 మి.గ్రా.. నియాసిన్ 1.1 మి.గ్రా. థయమిన్ 0.42 మి.గ్రా.. రైబోఫ్లావిన్ 0.19 మి.గ్రా.. కూడా అందుతాయి. ఇలాంటి పోషకాలతో కూడిన రాగులు మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయో చూద్దాం.
* అధిక బరువు తగ్గటానికి: రాగుల్లోని ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరరంలో కేలరీలు పోగుపడకుండా చూస్తాయి. ఇక వీటిల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడేవే.
* ఎముక పుష్టికి: వీటిల్లో క్యాల్షియం దండిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తాయి.
* మధుమేహం నియంత్రణకు: రాగుల్లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి.
* కొలెస్ట్రాల్ తగ్గేందుకు: లెసిథిన్, మెథియోనైన్ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును నిర్మూలిస్తుంది. ఇక థ్రియోనైన్ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది.
* రక్తహీనత: రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది.
* ఆందోళన: వీటిల్లోని ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి. కొన్నిరకాల పార్శ్వనొప్పులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది.
* కండరాల మరమ్మతుకు: ఐసోల్యూసిన్ అమైనో ఆమ్లం కండరాల మరమ్మతుకు, రక్తం ఉత్పత్తికి, ఎముక ఏర్పడటానికి, చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. వాలైన్ అమైనో ఆమ్లం జీవక్రియ సరిగా జరగటంలో పాలుపంచుకుంటుంది. కండరాలు సమన్వయంతో పనిచేయటానికి, శరీరంలో నైట్రోజన్ సమతుల్యతకు తోడ్పడుతుంది.
* వృద్ధాప్యం దూరంగా: రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణలోపాన్ని దూరంగా ఉంచొచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు.
- ==========================
Visit my Website - Dr.Seshagirirao...