Pages

Labels

Blog Archive

Popular Posts

Thursday, 7 November 2013

Clear waste products in the body,శరీరంలో పేరుకొనే వ్యర్థాలకు తొలగించడానికి


  •  





  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.









శరీరంలో పేరుకొనే వ్యర్థాలు(free radicles)... అందంతో పాటూ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. మరి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటే ఆహారంలో కొన్నింటిని తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో ముఖ్యంగా...



బీట్‌రూట్‌ :

ఈ దుంపలో బి3, బి6లతోపాటూ విటమిన్‌ సి మొదలగు విటమిన్లు ఉంటాయి. ఇవి వ్యర్థాలను తొలగించేలా చేస్తాయి. కాలేయం పనితీరునూ మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. పైగా దీన్ని కూరగానే కాదు, పచ్చిగా, జ్యూస్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.



యాపిల్‌ :

రోజుకో పండు తిన్నా చాలు... సంపూర్ణ ఆరోగ్యం అందుతుందంటారు. అదే సమయంలో యాపిల్‌లో లభించే పీచు వ్యర్థాలను చాలా సులువుగా తొలగిస్తుంది. దీన్నుంచి అందే విటమిన్లూ, ఖనిజాలూ, ఫ్లవనాయిడ్లూ కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల కూడా వ్యర్థాలు సులువుగా దూరమవుతాయి.



దానిమ్మ :

దీన్లోని గింజలు వ్యర్థాలను తొలగిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాదు త్వరగా వార్థక్యపు ఛాయలు రాకుండా చూస్తాయి.



యాంటి ఆక్షిడెంట్లు గా పిలువబడే .. .. .. విటమిన్‌ ' ఏ' , విటమిన్‌ ' సి " , విటమిన్‌ ' ఇ" మరియు సెలీనియం , క్రోమియం , లైకోఫిన్‌ , మొదలగునవి ప్రతిరోజూ ఆహారములో తీసుకుంటే ఫ్రీ-రాడికిల్స్ ఆనే వ్యర్ధపదార్ధాలు మనశరీరమునుండి ఎప్పటికప్పుడు తొలగించబడును. 




  • =================================


Visit my Website - Dr.Seshagirirao...