పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
నిద్ర సరిగా పట్టటం లేదని బాధపడుతున్నారా? అయితే ఎలాంటి ఆహారం
తీసుకుంటున్నారో కూడా కాస్త చూసుకోండి. ఎందుకంటే మనం తినే తిండి, తాగే
పానీయాలూ నిద్రపై చాలా ప్రభావం చూపుతాయి. కొన్ని నిద్ర పట్టనీయకుండా
చేస్తే.. మరికొన్ని మగతను కలగజేస్తాయి.పడక చేరాక పదినిమిషాలు కూడా గడవకముందే గాఢనిద్రలోనికి జారిపోయే అదృషటవంతులు కొందరు ఉంటే , మంచం లో దొ్ర్లడమే తప్ప కునుకు రానివారు కొందరుంటారు .
నిద్రకు సహకరించే ఆహారపదార్ధములు --->
- పాలు , పెరుగు వంటి డైరీ ఉత్పత్తులలో " ట్రిప్టోఫాన్ " ఉంటుంది , ఈ ఎమినోయాసిడ్ స్లీప్ సెరటోనిన్ ఉత్పత్తికి , నిద్రకు సహకరించే మెలటోనిన్ కు , శారీరక అంతర్గత క్లాక్ క్రమబద్దీకరణకు సహకరిస్తుంది.
- ఆహారములో కాల్షియం లోపము వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఓట్స్ ట్రిప్టోఫాన్ కు చక్కని సహజ ఆధారము . పడుకునే ముందు వీటిని స్నాక్ గా తీసుకుంటే ప్రశాంతము గా నిద్ర పడుతుంది.
- అరటిపండు మెగ్నీషియం , పొటాషియం , ఖనిజాలకు అద్భుత ఆధారము .కండరాల క్రాంప్స్ , స్పాసమ్ వంటివి రాత్రివేల రాకుండా సహకరిస్తుంది . బెడ్ టైమ్ తింటే మంచి నిద్ర వస్తుంది.ముఖ్యముగా భారీ ఎక్సర్ సైజ్ సెషన్ తర్వాత అరటి పందు చాలా మంచిది .స్లీప్ ఆప్నియా తో బాధపడుతున్న వారు పడుకునే ముందు అరటి పండు తినాలి .
- చెర్రీలు మెలటోనిన్ కి సహజ ఆధారము పడుకునే ముందు వీటిని తింటే త్వరితము గా నిద్రపడుతుంది. తాజా చెర్రీలు , చెర్రీ జ్యూస్ మంచి నిద్రకారిణి .
- అవిసె గింజలు శరీరములో నిద్రను క్రమబద్ధీకరించే ' సెరటోనిన్' స్థాయిలను మెరుగుపరచడము లో బాగా సహకరిస్తుంది.
- పిండి పదార్థాలతో కూడిన ఆహారం.. ట్రీప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని మెదడుకు
చేరుకునేలా చేసి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. ప్రోటీన్లతో నిండిన
పదార్థాల్లోనూ ట్రీప్టోఫాన్ ఉంటుంది. అందువల్ల ప్రోటీన్లతో పాటు పిండి
పదార్థాలనూ తీసుకోవటం నిద్రకు ఉపకరిస్తుంది. కడుపునిండా దండిగా ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా గల ఆహారం తిన్నప్పుడూ నిద్రమత్తుతో జోగేలా చేస్తుంది.
- =====================
Visit my Website - Dr.Seshagirirao...